ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కొడుకంటే ఇలా ఉండాలి.. ప్రమాదంలో ఉన్న తల్లిని ఎలా కాపాడాడో చూడండి..

ABN, First Publish Date - 2022-12-23T21:22:19+05:30

కొడుకు ఎలాంటి వాడైనా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. వృద్ధాప్యంలో తనను పట్టించుకోకపోయినా.. నిత్యం కొడుకు సంక్షేమాన్నే కోరుకుంటుంది తల్లి. అలాంటి తల్లుల పట్ల చాలా మంది ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకు ఎలాంటి వాడైనా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. వృద్ధాప్యంలో తనను పట్టించుకోకపోయినా.. నిత్యం కొడుకు సంక్షేమాన్నే కోరుకుంటుంది తల్లి. అలాంటి తల్లుల పట్ల చాలా మంది కొడుకులు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొందరు మాత్రం తల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తల్లీకొడుకుల (Mother and son) అనుబంధానికి ప్రతీకగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆడుకునే వయసులో ఉన్న బుడ్డోడు.. తల్లి పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తల్లి ప్రమాదంలో ఉందని గుర్తించి, ఎంతో తెలివిగా ఆమె ప్రాణాలు కాపడిన వైనం అందరినీ కట్టిపడేస్తోంది.

ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన వ్యక్తి.. వెతుక్కుంటూ వెళ్లగా పార్కులో ప్రత్యక్షం.. జరిగిన విషయం తెలుసుకుని..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ మహిళ పెద్ద నిచ్చెన పైకి ఎక్కి ఏదో పని చేస్తూ ఉంటుంది. కింద తన కొడుకు ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో నిచ్చెన జారి కిందపడుతుంది. దీంతో ఆమె పైన ఉన్న చెక్కను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. వెంటనే గట్టిగా కేకలు పెడుతుంది. దీంతో పక్కన ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి ప్రమాదంలో ఉందనే విషయాన్ని గుర్తిస్తాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిచ్చెనను పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

అంత పెద్ద నిచ్చెన పైకి ఎత్తడం తన వల్ల కాదని తెలిసినా పైకి ఎత్తేందుకు సాహసిస్తాడు. చివరకు ఎలాగోలా నిచ్చెనను పైకి ఎత్తేస్తాడు. దీంతో పైన వేలాడుతూ ఉన్న తల్లి తన కాళ్లతో నిచ్చెనను పట్టుకుని నిలబెడుతుంది. తర్వాత మళ్లీ తన తల్లి ఎక్కడ కిందపడుతుందో అనే భయంతో నిచ్చెన వద్దే నిలబడి పట్టుకుని ఉండడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో తల్లి పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు.. అని కామెంట్లు పెడుతున్నారు.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

Updated Date - 2022-12-23T21:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising