ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లిలో బంధువులంతా డ్యాన్స్ చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన.. అంతా చూస్తుండగానే..

ABN, First Publish Date - 2022-12-25T19:28:13+05:30

వివాహం అంటేనే.. ముందుగా గుర్తుకు వచ్చేది డీజీ పాటలకు చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా వేసే స్టెప్పులు. ఇటీవల వధూవరులు కూడా అందరి ముందూ డ్యాన్స్ చేయడం సర్వసాధారణమైంది. వివాహానికి సంబంధించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహం అంటేనే.. ముందుగా గుర్తుకు వచ్చేది డీజీ పాటలకు చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా వేసే స్టెప్పులు. ఇటీవల వధూవరులు కూడా అందరి ముందూ డ్యాన్స్ చేయడం సర్వసాధారణమైంది. వివాహానికి సంబంధించి వధూవరుల ఎంట్రీ, ఒకరికొకరు ఆట పట్టించుకోవడం తదితర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వివాహ కార్యక్రమంలో బంధువులంతా డ్యాన్స్ (Wedding dance videos) చేస్తున్నారు. అంతలో అంతా చూస్తుండగా... సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వివాహ వేడుకలో (Wedding ceremonies) బంధువులంతా సరదాగా నృత్యం చేస్తుంటారు. అయితే అంతలో షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా.. వారు నిల్చున్న స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో చాలా మంది సడన్‌గా కిందపడిపోతారు. కొందరు అప్రమత్తమై చివరి నిముషంలో పక్కకు తప్పుకొంటారు. అయితే లోతు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని, అంతా చిన్న చిన్న గాయాలతో బయటపడుంటారని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేదో సినిమా షూటింగ్‌లా ఉందని కొందరు.. వారందరికీ ఏమీ కాకూడదంటూ మరికొందరు ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

హనీమూన్‌ నుంచి రాగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య.. భర్త తప్పు చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో.. చివరకు..

Updated Date - 2022-12-25T19:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising