Viral Video: మంచు తుపాను దాటికి గడ్డ కట్టుకుపోయిన జింక మొఖం.. చివరకు ఏమైందో మీరే చూడండి..
ABN, First Publish Date - 2022-12-30T16:19:25+05:30
చిన్నపాటి చలికే గజగజా వణికిపోతుంటాం. అలాంటిది ఇక మంచు కురిసే ప్రాంతంలో నివసించే వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల వరకూ ఎలాగోలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అయితే..
చిన్నపాటి చలికే గజగజా వణికిపోతుంటాం. అలాంటిది ఇక మంచు కురిసే ప్రాంతంలో నివసించే వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల వరకూ ఎలాగోలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అయితే గడ్డ కట్టే మంచు ప్రాంతాల్లో సంచరించే జంతువుల పరిస్థితి ఏంటీ అని ఆలోచిస్తే.. సమాధానం ఉండదు. సాధారణంగా వాటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అంతా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు జంతువులు కూడా మంచుదాటికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. మన దాకా చేరితే గానీ వాటి సమస్యలు తెలిసే అవకాశం ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి వీడియోలు మారుమూల గ్రామాల వరకూ చేరుతున్నాయి. మంచు ప్రాంతంలో జింక (deer) మొఖం గడ్డ కట్టిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral videos) అవుతోంది.
Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..
USA, కెనడాలోని (USA and Canada) పలు ప్రాంతాల ప్రజలు మంచు తుఫాను (snow storm) దాటికి విలవిల్లాడిపోతున్నారు. మనుషులతో పాటూ జంతువులకూ అవస్థలు తప్పడం లేదు. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల జింకకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మంచు దాటికి ఓ జింక మొఖం పూర్తిగా గడ్డ కట్టిపోయింది. కళ్లు కూడా కనిపించనంత స్థితిలో మంచు పేరుకుపోయింది. దాన్ని తొలగించుకునే క్రమంలో జింక అవస్థలు పడుతూ ఉండగా.. స్థానికులు గమనించారు. వెంటనే దాన్ని పట్టుకుని, చాలా సేపు శ్రమించి.. మంచును పూర్తిగా తొలగించారు. మొంచు మొత్తం తొలగించడంతో జింక కాసేపు అలాగే పడుకుని ఉపశమనం పొందింది. తర్వాత అక్కడి నుంచి చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయ్యో పాపం! జింకకు ఎంత కష్టం వచ్చింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2022-12-30T16:28:10+05:30 IST