Bangladesh vs India: మూడో రోజు బంగ్లాదేశ్‌కు గుబులు పుట్టిస్తున్నభారత బౌలర్లు
ABN, First Publish Date - 2022-12-24T10:33:32+05:30
భారత్(Team India)తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్(Bangladesh) మూడోరోజు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
ఢాకా: భారత్(Team India)తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్(Bangladesh) మూడోరోజు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టును అశ్విన్ (Ravichandran Ashwin) తొలి దెబ్బ తీశాడు. 13 పరుగుల వద్ద ఓపెనర్ నజ్ముల్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోమినుల్ హక్ (Mominul Haque)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. 5 పరుగులు మాత్రమే చేసిన మోమినుల్.. పంత్(Rishabh Pant)కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 26 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఉనద్కత్ కూడా బంతులకు పదునుపెట్టాడు. నిదానంగా ఆడుతున్న కెప్టెన్ షకీబల్ (13)ను అవుట్ చేశాడు. దీంతో 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ రాహుల్(10), శుభమన్ గిల్ (20), పుజారా (24) కోహ్లీ (24) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం జకీర్ హసన్ (26), ముష్ఫికర్ రహీం క్రీజులో ఉన్నారు. భారత్ కంటే బంగ్లాదేశ్ 36 పరుగులు వెనకబడి ఉంది.
Updated Date - 2022-12-24T10:33:39+05:30 IST