ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Defeat: టీమిండియా ఎందుకింత ఘోరంగా ఓడింది.. టాప్ 5 కారణాలు ఇవే..

ABN, First Publish Date - 2022-11-10T19:47:58+05:30

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా (IND vs ENG) ఓడింది. కానీ.. ఇది అలాంటిఇలాంటి ఓటమి కాదు. ఘోర పరాజయం. మర్చిపోలేని పరాభవం. ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా (IND vs ENG) ఓడింది. కానీ.. ఇది అలాంటిఇలాంటి ఓటమి కాదు. ఘోర పరాజయం. మర్చిపోలేని పరాభవం. ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు టీమిండియా (India vs England) పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బౌలింగ్ విభాగం (India Bowling) మరీ ఇంత బలహీనంగా ఉందా, ఒక్క వికెట్ కూడా తీయలేనంత దీన స్థితిలో ఉందా అనే ప్రశ్నలు, విమర్శలు ట్విట్టర్‌లో (Twitter) చక్కర్లు కొడుతున్నాయి. ‘5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచినంత సులువు కాదు వరల్డ్ కప్ (T20 World Cup) గెలవడం అంటే’ అనే వ్యంగ్యాస్త్రాలు ‘5 IPL’ పేరుతో ట్విట్టర్‌లో రోహిత్ శర్మను (Rohit Sharma) నిందిస్తూ ట్రెండ్ అవుతున్నాయి.

ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైతే విమర్శలు, టీమిండియా అభిమానుల నుంచి తిట్లు, శాపనార్థాలు సహజం. కానీ.. ఇంతటి ఘోర పరాజయం ఎదురైతే మాత్రం సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీమిండియా బలహీనతలను ఇంగ్లండ్ బయటపెట్టినట్టయింది. ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాకు (Eng vs IND) ఇంతటి చేదు అనుభవం ఎదురవడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి.

బౌలింగ్‌లో పేస్ విభాగం బలహీనంగా ఉండటం:

బుమ్రా లాంటి కీలక పేస్ బౌలర్ దూరం కావడం ఈ వరల్డ్ కప్‌లో ఎదురైన పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. బుమ్రా విసిరే యార్కర్లను పటిష్టంగా తిప్పి కొట్టడం అంత సులువు కాదు. బుమ్రాను భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 150kmph స్పీడ్‌తో బౌలింగ్ చేసే యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ పేరు వినిపించినప్పటికీ చివరకు షమీనే జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో షమీని ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఉతికారేశారు. షమీ బౌలింగ్ చేసిన 3 ఓవర్లకు 39 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా.. టీమిండియా పేస్ బౌలింగ్ విషయంలో మరోసారి అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బుమ్రా లేకపోతే పేస్ విభాగం మరీ ఇంత నాసిరకంగా బౌలింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.

3పదులు దాటిన ఆటగాళ్లపైనే ఆధారపడటం:

టీమిండియా యువ ఆటగాళ్ల కంటే మూడు పదులు దాటిన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 35. విరాట్ కోహ్లీ వయసు 34. దినేష్ కార్తీక్ వయసు 37. షమీ, భువీ వయసు 32 సంవత్సరాలు. సూర్యకుమార్ యాదవ్ వయసు 32 సంవత్సరాలు. కోహ్లీని మినహాయిస్తే మిగిలిన ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అసలుసిసలు మ్యాచ్‌లో 5 పరుగులకే ఔట్ అయి టీమిండియా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అతనిని ట్విట్టర్‌లో కొందరు టీమిండియా అభిమానులు ఘోరంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే టీమిండియాకు యువ ఆటగాళ్ల అవసరం కనిపిస్తోంది.

చాహల్‌కు అవకాశం ఇవ్వకపోవడం:

టీమిండియా ఈ వరల్డ్ కప్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. సూపర్ 12 దశలో ఐదు మ్యాచ్‌లు, ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడటం జరిగింది. అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా చాహల్‌కు అవకాశం ఇవ్వలేదు. టీమిండియా స్పిన్ విభాగంలో అశ్విన్, అక్షర్ పటేల్‌కు మాత్రమే అవకాశం దక్కింది. కానీ.. టీ20 క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్లకు మంచి రికార్డ్ ఉంది. అలాంటి మణికట్టు స్పిన్నర్ అయిన చాహల్‌ను పక్కనపెట్టేయడం, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడేందుకు అవకాశం ఇవ్వకపోవడం టీమిండియా ఘోర తప్పిదంగా క్రికెట్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. సెమీస్ మ్యాచ్‌లో పేస్, స్పిన్ అని తేడా లేకుండా అశ్విన్‌ను, అక్షర్ పటేల్‌ను కూడా బాగానే ఆడేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్ చేసిన 2 ఓవర్లలోనే 27 పరుగులు వచ్చాయంటే టీమిండియా బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పవర్‌ప్లేలో టీమిండియా ఓపెనర్లు చేతులెత్తేయడం:

టీమిండియా ఓపెనర్ల విషయంలో ఇటీవల తరచుగా పవర్‌ప్లేలో ఎందుకు దూకుడుగా ఆడటం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆరంభంలో మంచి స్కోర్ చేయాల్సిన ఓపెనర్ కేఎల్ రాహుల్ 5 పరుగులకే ఔట్ కావడం టీమిండియాకు పెద్ద మైనస్ అయింది. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించి.. నాలుగు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడం కేఎల్ రాహుల్‌పై విమర్శలకు కారణం. పైగా.. రాహుల్ రాణించిన ఆ రెండు మ్యాచులు కూడా చిన్న జట్లపైనే కావడంతో కీలక జట్లతో ఆడే విషయంలో కేఎల్ రాహుల్ చేతులెత్తేశాడని విమర్శలొచ్చిన పరిస్థితి.

అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్:

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా రాణించింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. మరీ ముఖ్యంగా.. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), జాస్ బట్లర్(80) పరుగులతో నాటౌట్‌గా నిలవడం ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం స్థాయి ఏంటో మరోసారి చాటి చెప్పినట్టయింది. అది కూడా ఈ ద్వయం 16 ఓవర్లకే 170 పరుగులు చేయడం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ దూకుడుకు నిదర్శనం. బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ వంటి ఆల్‌రౌండర్ల వరకూ కూడా మ్యాచ్ రాకపోవడం ఇంగ్లండ్ ఓపెనర్ల సత్తాను తెలియజేసింది. టీమిండియా ఓపెనర్ల పేలవ ప్రదర్శనను, మిడిలార్డర్‌ పైనే ఆధారపడుతున్న దయనీయ స్థితిని గుర్తుచేసింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పైనే ఆధారపడేంతలా పరిస్థితి తయారవడం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్న విషయం. హార్థిక్ పాండ్యా ఈ సెమీస్ మ్యాచ్‌లోనే చెప్పుకోతగిన స్కోర్ చేయడం గమనార్హం.

Updated Date - 2022-11-10T19:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising