ENG vs SL: ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో లంకపై ఇంగ్లండ్ గెలుపు..
ABN, First Publish Date - 2022-11-05T17:13:23+05:30
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్టయింది ఈ వరల్డ్ కప్‌లో...
సిడ్నీ: హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్టయింది ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన జట్టే వరల్డ్ కప్ నుంచి ఔట్ కావడం ఆస్ట్రేలియా అభిమానులను నిరాశపరిచింది. శ్రీలంక గెలుపు కోసం లంక అభిమానుల కంటే ఆస్ట్రేలియా అభిమానులే ఎక్కువగా ఎదురుచూశారు. ఒకానొక దశలో శ్రీలంక గెలుస్తుందేమోనన్న ఆశ కూడా లంక అభిమానుల్లో కలిగింది. అయితే.. ఒక్క ఫోర్‌తో క్రిస్ ఓక్స్ లంక అభిమానుల ఆశలతో పాటు ఆస్ట్రేలియా సెమీస్ ఆశలపై కూడా నీళ్లు చల్లాడు.
సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేయాలని భావించిన శ్రీలంక జట్టుకు నిరాశే ఎదురైంది. శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 19.4 ఓవర్లలో 144 పరుగులు చేసి శ్రీలంకను ఓడించింది.
Updated Date - 2022-11-05T17:14:20+05:30 IST