Ind vs Netherlands: టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణం ఇదా!
ABN, First Publish Date - 2022-10-27T12:49:26+05:30
టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (IND vs PAK) ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా నేడు నెదర్లాండ్స్‌తో..
సిడ్నీ: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (IND vs PAK) ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా నేడు నెదర్లాండ్స్‌తో (India vs Netherlands) తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు. పాకిస్థాన్‌తో జరిగిన అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచాక తమపై అంచనాలు భారీగా ఉంటాయని.. అయితే తాము మాత్రం సంయమనం వహిస్తూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని తెలిపాడు. ఇదిలా ఉండగా.. టీమిండియా అభిమానులు మాత్రం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనగానే ఓ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 2011 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడిందని, ఆ సీజన్ వరల్డ్ కప్ టీమిండియా వశమైందని.. ఇప్పుడు కూడా నెదర్లాండ్స్‌తో టీమిండియా పోటీ పడుతోందని గుర్తుచేస్తున్నారు.
నెదర్లాండ్స్ బౌలింగ్ విభాగం అంత తీసేసేదేమీ కాదు. లీగ్ దశలో ఆకట్టుకొన్న నెదర్లాండ్స్.. సూపర్-12లో బంగ్లాదేశ్‌కు కూడా ముచ్చెమటలు పట్టించింది. ఆల్‌రౌండర్ బాస్ లి లీడ్స్ జట్టులో కీలక ఆటగాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉండడంతో.. ఇక్కడి పిచ్‌లపై అతడికి అవగాహన ఉంది. బౌలింగ్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ జట్టుకు అండగా నిలుస్తున్నారు. బ్యాటింగ్‌లో కొలిన్ ఎకర్‌మెన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. టాపార్డర్ సత్తా చాటాలి. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆస్ట్రేలియా-ఎకు ఆడిన టామ్ కూపర్‌కు కూడా విదేశీ లీగ్‌లు ఆడిన అనుభవం ఉంది.
ఇదిలా ఉండగా.. సిడ్నీ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇదే పిచ్‌పై 200 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. డచ్ టీమ్‌ను తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు. పాక్‌తో మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలం కాగా.. కోహ్లీ పోరాటంతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వాతి పోరులో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడాల్సిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్, రాహుల్, సూర్యకుమార్‌లు ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకొని సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. రాహుల్ తన టెక్నిక్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉండగా.. సారథిగా రాణిస్తున్న రోహిత్ ఫామ్‌ను అందిపుచ్చుకోవాలి. వీరు చెలరేగితే డచ్ బౌలర్లకు ఇక చుక్కలే. అందుకే టాస్ గెలిచిన రోహిత్ సేన భారీస్కోరు చేయాలనే ఆలోచనతో బ్యాటింగ్ ఎంచుకుంది.
Updated Date - 2022-10-28T13:58:53+05:30 IST