ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PAK vs ENG: టాస్ గెలిచి మళ్లీ అదే పని చేసిన ఇంగ్లండ్.. టీమిండియాకు జరిగినట్టే పాకిస్థాన్‌కు కూడా జరుగుతుందా..?

ABN, First Publish Date - 2022-11-13T13:16:22+05:30

ఇంగ్లండ్, పాకిస్థాన్ (England vs Pakistan) జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో (T20 Final) ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: ఇంగ్లండ్, పాకిస్థాన్ (England vs Pakistan) జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో (T20 Final) ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ (England Opt to Bowl) ఎంచుకుంది. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (MCG) ఈ రసవత్తర పోరుకు వేదికైంది. టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కూడా ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగే ఎంచుకుంది. ఆ తర్వాత టీమిండియా నిర్దేశించిన టార్గెట్‌ను ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించి టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌తో ఫైనల్‌లో కూడా ఇంగ్లండ్ ఇదే గేమ్ ప్లాన్‌ను అనుసరించడంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి మొదలైంది.

బౌలింగే బలంగా..

పాక్‌ యువ పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది తన చివరి మూడు మ్యాచ్‌ల్లోనే తొమ్మిది వికెట్లతో ఊపు మీదున్నాడు. వీటిలో ఏ మ్యాచ్‌లోనూ అతను 30 పరుగులకు మించి ఇవ్వలేదు. అలాగే ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ పది వికెట్లతో సత్తా చాటాడు. ఇక నసీమ్‌ షా కూడా కట్టుదిట్టమైన బంతులతో పరుగులకు చెక్‌ పెడుతున్నాడు. మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఆరంభంలో వికెట్లను తీయగలుగుతున్నాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, రిజ్వాన్‌ ఫామ్‌లోకి రావడం ఈ జట్టుకు అతిపెద్ద ఊరట. ఈ ఓపెనింగ్‌ జోడీ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమంగా కొనసాగుతోంది. అలాగే మూడో నెంబర్‌లో 21 ఏళ్ల మహ్మద్‌ హరీస్‌ తొలి 10 ఓవర్లలో వేగంగా ఆడుతూ ఒత్తిడి తగ్గిస్తున్నాడు. మిడిలార్డర్‌లో షాదాబ్‌, ఇఫ్తికార్‌, షాన్‌ మసూద్‌ ఇప్పటికే అర్ధసెంచరీలతో ఫామ్‌ కనబరిచారు. ఈ కీలక మ్యాచ్‌లో వీరంతా కలిసికట్టుగా రాణిస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు.

బ్యాటింగ్‌ పవర్‌హౌస్‌

భారత్‌తో జరిగిన సెమీ్‌సలో ఓపెనర్లు హేల్స్‌, బట్లర్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు చూస్తే లక్ష్యమెంతైనా ఛేదిస్తారేమో అనిపించింది. టోర్నీ ఆరంభంలో ఈ జోడీ నుంచి మెరుపులు లేకపోయినా సరైన సమయంలో బ్యాట్లు ఝుళిపించింది. ఇక నేడు పాక్‌ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే. ఆల్‌రౌండర్లు స్టోక్స్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌ కూడా మెరుపు వేగంతో ఆడేవారే. తొమ్మిదో నెంబర్‌ వరకు బ్యాటర్స్‌ ఉండడం వీరికి కలిసిరానుంది. ఇక బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపిస్తోంది. పేసర్‌ సామ్‌ కర్రాన్‌ అఫ్ఘాన్‌పై ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్న పేసర్‌ మార్క్‌ ఉడ్‌ ఈ మ్యాచ్‌కు కూడా సందేహమే. స్పిన్నర్‌ రషీద్‌ మాత్రం కేవలం రెండు వికెట్లే తీయగలిగాడు. అయితే మిడిలార్డర్‌కు ఎక్కువగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. దీంతో పాక్‌ బౌలర్లు ఓపెనర్లను త్వరగా అవుట్‌ చేస్తే వీరి బ్యాటింగ్‌ నైపుణ్యం తెలిసొస్తుంది.

Updated Date - 2022-11-13T13:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising