ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL auction: ఐపీఎల్‌ వేలంలో ఎవరెవరు ఎంత పలికారంటే..

ABN, First Publish Date - 2022-12-23T14:53:29+05:30

ఐపీఎల్‌ మినీ వేలం మొదలైంది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆయా జట్లలో మిగిలిన స్థానాల కోసం ఆటగాళ్ల కొనుగోలుకు జట్లు రంగంలోకి దిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైల్ జమీసన్‌ను దక్కించుకున్న చెన్నై

కైల్ జమీసన్‌ను రూ.1 కోట్ల బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్. ఇక క్యాప్డ్ ఆల్‌రౌండర్ రొమోరియో షెఫెర్డ్‌ను రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లుతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది. మరోవైపు మనీష్ పాండే రూ.2.4 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది.

05:10 PM - యువ ఆటగాళ్లను దక్కించుకున్న సన్‌రైజర్స్

అన్‌క్యాప్‌డ్‌ ఆల్‌రౌండర్ల వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలువురు యువ ఆటగాళ్లను దక్కించుకుంది. రూ.2.6 కోట్లతో వివ్రాంత్ శర్మ, రూ.20 లక్షలతో సమర్థ వ్యాస్, రూ. 20 లక్షలతో సాన్విర్ సింగ్‌లను సొంతం చేసుకుంది.

04:40 PM - ఐపీఎల్ మినీ వేలంలో ఎవరెవరు ఎంత పలికారంటే..

04:30 PM - ఢిల్లీ క్యాపిటల్స్ చేతికి ఇషాంత్ శర్మ..

పేస్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇక మరో బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కత్‌ను రూ.50 లక్షలతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.

4:26 PM - అదీల్ రషీద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

ఇంగ్లండ్ లెగ్‌స్పిన్నర్ అదిల్ రషీద్‌ను (Adil Rashid) సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. రూ.2 కోట్ల మొత్తంతో ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.

4:21 PM - నికోలస్ పూరన్‌కు ఏకంగా రూ.16 కోట్లు

వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ (nicholas pooran) ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. ఏకంగా రూ.16 కోట్ల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.

4:10 PM - సెట్-1, సెట్-2 వేలం ఇప్పటివరకు..

03:55 PM - రూ.17.5 కోట్లతో కెమరాన్ గ్రీన్‌ను దక్కించుకున్న ముంబై

ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కెమరాన్ గ్రీన్ (Cameron Green) ఐపీఎల్ వేలంలో రికార్డ్ స్థాయి ధర పలికాడు. ఏకంగా రూ.17.5 కోట్ల మొత్తంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈ ఆటగాడిని దక్కించుకుంది. కెమరాన్ గ్రీన్... బేస్ ప్రైస్ కేవలం రూ.2 కోట్లు మాత్రమే కాగా.. ఇతగాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి.

03:48 PM : బెన్ స్టోక్స్‌కు రూ.16.25 కోట్లు పెట్టిన సీఎస్‌కే

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ (Ben stokes) అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. ఏకంగా రూ.16.25 కోట్ల మొత్తంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈ ప్లేయర్‌ను దక్కించుకుంది. స్టోక్స్ కోసం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి.

03:26 PM- చరిత్ర సృష్టించిన సామ్ కర్రాన్

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ (Sam Curran) ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధికంగా రూ.18.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాడిని దక్కించుకుంది. సామ్ కర్రాన్ బేస్ ప్రైస్ కేవలం రూ.2 కోట్లు మాత్రమే కాగా వేలంలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. కాగా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక రేటు పలికిన ఆటగాడిగా.. అత్యంత విలువైన ప్లేయర్‌గా సామ్ కర్రాన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడూ ఈ స్థాయి ధర పలకకపోవడం విశేషం.

3:02 pm - మయాంక్ అగర్వాల్‌కు రూ.8.25 కోట్లు

ఐపీఎల్ వేలం ఆటగాళ్ల కొనుగోలులో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకెళ్తోంది. హ్యారీ బ్రూక్‌కు రికార్డ్ స్థాయిలో రూ.13.25 కోట్లు వెచ్చించిన ఎస్‌ఆర్‌ఎస్.. మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు దక్కించుకుంది. మయాంక్ అగర్వాల్ కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.

2:55 pm - హ్యారీ బ్రూక్‌‌కు రికార్డ్ ధర

ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు (Harry Brook) ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికాడు. ఏకంగా రూ.13.25 కోట్ల భారీ మొత్తంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (Sunrisers Hyderabad) దక్కించుకుంది. బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. బ్రూక్ బిడ్ ప్రైస్ కేవలం రూ.5 కోట్లే కాగా ఏకంగా రూ.13.25 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

2:30 PM : ఐపీఎల్‌ మినీ వేలం షురూ..

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆయా జట్లలో మిగిలిన స్థానాల కోసం ఆటగాళ్ల కొనుగోలుకు జట్లు రంగంలోకి దిగాయి. అందుబాటులో ఉన్న మొత్తం 405 మంది క్రికెటర్లు వేలంలో అందుబాటులో ఉండగా.. 30 మంది విదేశీ ఆటగాళ్లు సహా 87 మంది ప్లేయర్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.

సామ్ కర్రాన్‌ రికార్డు బద్దలుకొడతాడా?

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రాన్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2021లో చెన్నైకి ఆడిన ఈ ఇంగ్లండ్‌ స్టార్‌.. వెన్ను గాయంతో 2022 సీజన్‌కు దూరమయ్యాడు. కానీ, టీ20 కప్ విశ్వకప్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రిస్‌ మోరిస్‌ రూ. 16.25 కోట్ల రికార్డును కర్రాన్‌ బద్దలు4 కొడతాడనే అంచనాలున్నాయి. రూ. 2 కోట్ల కనీస ధర నిర్ణయించిన కర్రాన్‌ కోసం చెన్నై, ముంబై, పంజాబ్‌ పోటీపడే చాన్సుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిసేపు ఎదురుచూడాల్సింది.

ఇక సామ్‌‌తో ఇంగ్లండ్‌కే చెందిన స్టోక్స్‌, హ్యారీ బ్రూక్స్‌ కూడా వేలంలో భారీ ధరకు అమ్ముడవొచ్చనే అంచనాలున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బ్రూక్స్‌ మూడు వరుస సెంచరీలతో దుమ్ము రేపగా.. క్లిష్టపరిస్థితుల్లోనూ నిలకడగా ఆడుతూ జట్టును గట్టెక్కించగల సమర్థుడు స్టోక్స్‌. ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌, జో రూట్‌, జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్‌ రజాకు భారీ డిమాండ్‌ ఉండొచ్చు. పంజాబ్‌ వదిలేసిన టీమిండియా ఆటగాళ్లలో మయాంక్‌ అగర్వాల్‌ వేలానికి రానున్నాడు. మళ్లీ భారత జట్టులో చోటు ఆశిస్తున్న అగర్వాల్‌కు ఐపీఎల్‌లో రాణించడం ఎంతో కీలకం. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శివమ్‌ మావి, జగదీశన్‌ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించొచ్చు. కాగా, ఇంగ్లండ్‌ ప్లేయర్లు హేల్స్‌, బిల్లింగ్స్‌, వోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌తోపాటు ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ వేలంనుంచి వైదొలిగారు.

Updated Date - 2023-02-13T17:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising