ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Buttler: ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్..? ఈ అంచనాలపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఎంత మాటన్నాడంటే..

ABN, First Publish Date - 2022-11-09T14:32:11+05:30

టీ20 ప్రపంచకప్‌‌లో (T20 World Cup) రసవత్తర మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (New Zealand) జట్లు తలపడుతుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీ20 ప్రపంచకప్‌‌లో (T20 World Cup) రసవత్తర మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (New Zealand) జట్లు తలపడుతుండగా.. రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా (Team India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి (New Zealand vs Pakistan).. ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా (IND vs ENG) గెలిస్తే.. ఫైనల్‌లో (T20 World Cup Final) టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. అదే జరిగితే.. ఈ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అయితే.. ఈ అంచనాలపై ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ (Buttler) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియాతో సెమీస్ మ్యాచ్‌లో తమ జట్టే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేయడంతో పాటు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను చూడాలని తాము అనుకోవడం లేదని కామెంట్ చేశాడు. అలా జరగకుండా ఉండేందుకు తమ సర్వ శక్తులూ ఒడ్డుతామని రిపోర్టర్లతో మాట్లాడుతున్న సందర్భంలో బట్లర్ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉండగా.. సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. జట్టులో కీలక ఆటగాళ్లైన డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ ఇద్దరి ఫిట్‌నెస్‌పై బట్లర్ స్పందించాడు. మెడికల్ టీమ్‌పైన తమకు విశ్వాసం ఉందని.. వాళ్లిద్దరూ సెమీస్‌కు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశను మిగతా అన్ని జట్లకన్నా భారత్‌ ఎక్కువ విజయాలతో ముగించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి ఎనిమిది పాయింట్లతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

ఇక ఇప్పుడు దృష్టంతా ఇంగ్లండ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌పైనే ఉంది. ఈ పోరుకు వేదిక అడిలైడ్‌ ఓవల్‌ కానుండడం భారత్‌కు సానుకూలాంశం కానుంది. ఎందుకంటే.. టీమిండియా ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్‌ ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఇక్కడి పరిస్థితులపై ఇంగ్లండ్‌ కన్నా భారత ఆటగాళ్లకే ఎక్కువ అవగాహన ఉంది. అటు బట్లర్‌ సేన ఈ టోర్నీలో బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌, పెర్త్‌, సిడ్నీలలోనే బరిలోకి దిగింది. అయితే పొట్టి ఫార్మాట్‌లో గత రికార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఉండని విషయం తెలిసిందే. ఆ రోజున ఎవరు, ఎలా ఆధిపత్యం ప్రదర్శిస్తారనే దానిపైనే ఫైనల్‌కు వెళ్లగలమా? లేదా? అనేది నిర్ణయమవుతుంది. ఈ విషయం భారత జట్టుకు కూడా తెలుసు కాబట్టి.. జాగ్రత్తగా ఆడి తుది పోరుకు చేరాలనుకుంటోంది.

Updated Date - 2022-11-09T14:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising