ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh vs India: ముగిసిన రెండో రోజు ఆట

ABN, First Publish Date - 2022-12-23T17:13:24+05:30

బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 314 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిశాక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ (Bangladesh) ఆట ముగిసే సమయానికి వికెట్

Team India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 314 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిశాక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ (Bangladesh) ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. నజ్ముల్ హొసైన్ షంటో (5), జకీర్ హసన్ (2) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 19/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు (Team India) 314 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా 87 పరుగుల ఆధిక్యం లభించింది.

టీమిండియా బ్యాటర్లలో రిషభ్ పంత్ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పుజారా, కోహ్లీ కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు. ఇద్దరూ చెరో 24 పరుగులు చేసి అవుటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబల్ హసన్, తైజుల్ ఇస్లాం చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2022-12-23T17:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising