ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dinesh Karthik: కార్తీక్ నువ్వు సూపర్.. పంత్‌కు అండగా నిలిచిన వెటరన్!

ABN, First Publish Date - 2022-12-05T20:10:32+05:30

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు.

Rishabh Pant
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌కు పనిచెప్పలేక విమర్శలు కొనితెచ్చుకుంటున్నాడు. పంత్ ఎన్నిసార్లు విఫలమైనా జట్టు యాజమాన్యం మాత్రం అతడికే వంతపాడుతోంది. అయితే, ఇటీవల కురుస్తున్న విమర్శల జడివానతో వెనక్కి తగ్గిన సెలక్టర్లు.. బంగ్లాదేశ్ పర్యటన నుంచి పంత్‌ను పక్కనపెట్టారు.

ఈ నేపథ్యంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) స్పందించాడు. పంత్‌కు అండగా నిలిచాడు. నిజానికి పంత్ కారణంగా దినేశ్ కార్తీక్ అవకాశాలు చేజారిపోయాయి. చాలాకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ కష్టాల్లో ఉన్న పంత్‌కు మద్దతుగా నిలిచాడు. పంత్‌ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి అతడికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. పంత్‌పై విమర్శలు సరికాదన్న కార్తీక్.. అతడి టీ20 నంబర్ల ఆధారంగా వన్డేలపైనా విమర్శించడం సరికాదన్నాడు.

వన్డేల్లో గత 10 ఇన్నింగ్స్‌లలో పంత్ సగటు 45కుపైనేనని కార్తీక్ గుర్తు చేశాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో పంత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (125 నాటౌట్) ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి అతడు బాగానే ఆడుతున్నాడని అన్నాడు. ఒక్క మ్యాచ్‌లో ఆడనందుకే అతడిని వైదొలగమనడం సరికాదంటూ పంత్‌కు అండగా నిలిచాడు.

Updated Date - 2022-12-05T20:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising