ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dinesh Karthik: సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు.. దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-11-22T19:49:39+05:30

టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)‌లో భాగంగా ఇంగ్లండ్‌ (England)తో జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు (Team India) ఘోర పరాజయాన్ని

Dinesh Karthik
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)‌లో భాగంగా ఇంగ్లండ్‌ (England)తో జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు (Team India) ఘోర పరాజయాన్ని అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. ఐసీసీ ట్రోఫీ కోసం 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత ఆశలను ఈ ఓటమి దూరం చేసింది. అలాగే, టీ20 ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లయిన తర్వాత కూడా మరో కప్ భారత్‌కు అందని ద్రాక్షగా మారింది. ఇంగ్లండ్ చేతిలో భాతర జట్టు ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ (Chetan Sharma) సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటువేసి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ సంచలన నిర్ణయం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది.

బీసీసీఐ నిర్ణయంపై తాజాగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నాడు. అయితే, కొత్త సెలక్టర్ల రాకతో కొత్త కుర్రాళ్లకు అవకాశం లభిస్తుందేమో చూడాలని అన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు జట్టుకు దూరమైన డీకే.. ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో భారత తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

సెలక్టర్లపై ‘వేటు’ వేశారని అందరూ అంటున్నారని, కానీ ఆ పదం వాడడం సరికాదని, మార్పు అనివార్యమని దినేశ్ కార్టీక్ అభిప్రాయపడ్డాడు. చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్టర్ల కమిటీకి అండగా నిలిచాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 40-45 మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పుడు వారి నుంచి 15 మందిని ఎంచుకోవడమనేది మామూలు విషయం కాదన్నాడు. వారు చాలా చక్కగా పనిచేశారని కితాబిచ్చాడు. కొత్తగా వచ్చే సెలక్టర్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-11-22T19:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising