ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ind vs Zim: రోహిత్‌ను కలిసేందుకు గ్రౌండ్‌లోకి దూసుకెళ్లిన అభిమానికి భారీ జరిమానా!

ABN, First Publish Date - 2022-11-06T19:16:28+05:30

భారత్-జింబాబ్వే మ్యాచ్ సందర్భంగా ఓ అనుకోని సంఘటన జరిగింది. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: భారత్-జింబాబ్వే మ్యాచ్ సందర్భంగా ఓ అనుకోని సంఘటన జరిగింది. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) దగ్గరికి వస్తూనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడికి రూ. 6.5 లక్షల జరిమానా విధించారు. ఇక, ఈ మ్యాచ్ విషయానికి వస్తే జింబాబ్వేపై భారత జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-2లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ నెల 10న జరగనున్న రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతాయి.

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (suryakumar yadav) ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో జింబాబ్వే బౌలర్లను బెంబేలెత్తించాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. భారత్ నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో 61 పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Updated Date - 2022-11-06T19:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising