ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh vs India: బంగ్లాను తిప్పేసిన స్పిన్నర్లు.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

ABN, First Publish Date - 2022-12-18T10:07:16+05:30

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టగాంగ్‌: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య బంగ్లాను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చుట్టేశారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 324 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 188 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 272/6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా జట్టు మరో 52 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది.

బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హాసన్ శతకంతో (100) రాణించగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంతో అర్ధశతకం(67), కెప్టెన్ షకిబుల్ హాసన్ 84 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీస్తే.. కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు తీసి బంగ్లాను కోలుకోని దెబ్బతీసిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో 3వికెట్లు పడగొట్టి.. మొత్తంగా ఎనిమిది వికెట్లతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా' నిలిచాడు.

స్కోరుబోర్డు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 404; బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 150;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 258/2 డిక్లేర్‌; బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 324

Updated Date - 2022-12-18T10:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising