Sam Curran: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా శామ్ కరన్.. అవార్డుకు తాను తగిన వాడిని కాదంటూ..

ABN, First Publish Date - 2022-11-13T18:46:24+05:30

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్

Sam Curran: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా శామ్ కరన్.. అవార్డుకు తాను తగిన వాడిని కాదంటూ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 137 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్‌ (Sam Curran)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం శామ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు అందుకునే అర్హత తనకు లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో కరన్ నాలుగు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు నేల కూల్చాడు. ఫైనల్‌లో ఓ పేసర్ బెస్ట్ ఫిగర్స్ ఇవే.

138 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. పాక్ బౌలింగ్ ఎటాక్‌కు తొలుత తడబడింది. అయితే, బెన్‌స్టోక్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. స్టోక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో అజేయ అర్ధ సెంచరీ (52) సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం.. ఈ అనుభూతి ఎలా ఉందన్న ప్రశ్నకు కరన్ మాట్లాడుతూ.. నిజానికి ఈ అవార్డుకు తాను అర్హుడను కాదని అభిప్రాయపడ్డాడు. ఈ అవార్డు బెన్‌స్టోక్స్‌(Ben Stokes) కు చెందాల్సిందని, అతడే ఇందుకు అర్హుడని అన్నాడు. ఈ అవార్డు ట్రోఫీకి అతడే నిజమైన యజమాని అని చెబుతూ అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు.

మైదానం కొలతలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని దానిని కరెక్ట్‌గా అమలు చేసి విజయం సాధించానని శామ్ కరన్ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడాడు. వారు చుట్టుముట్టి తమపై ఒత్తిడి పెంచారని అన్నాడు. ఆ సమయంలో యువ స్టోక్స్ తన అనుభవాన్ని రంగరించి ఆడాడని ప్రశంసించాడు. గతంలోనూ ఇలాగే చేశాడని, అతడో గొప్ప ఆటగాడని ఆకాశానికెత్తేశాడు.

Updated Date - 2022-11-13T18:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising