Shoaib Malik and Sania Mirza: విడాకుల వార్తల నడుమ.. టీవీ షోకు హోస్ట్‌గా షోయబ్ మాలిక్-సానియా మీర్జా

ABN, First Publish Date - 2022-11-13T20:03:51+05:30

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) పొరపొచ్చాల కారణంగా

Shoaib Malik and Sania Mirza: విడాకుల వార్తల నడుమ.. టీవీ షోకు హోస్ట్‌గా షోయబ్ మాలిక్-సానియా మీర్జా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) పొరపొచ్చాల కారణంగా విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఓ టాక్ షో చేస్తున్నారన్న వార్త మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇద్దరూ కలిసి ఓ టాక్ షో నిర్వహించబోతున్నట్టు ఆ సంస్థ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది.

సానియా-షోయబ్ విడిపోతున్నట్టు అటు ప్రధాన మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువెత్తున్నప్పటికీ వీరిద్దరూ ఇప్పటి వరకు నేరుగా ఈ విషయమై స్పందించలేదు. వీరిద్దరూ 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజ్‌హాన్ మీర్జా మాలిక్ (Izhaan Mirza Malik) జన్మించాడు. కాగా, త్వరలోనే ఉర్దూఫ్లిక్స్‌ (Urduflix)లో ‘మీర్జా మాలిక్’ షో ప్రసారం కాబోతోందంటూ ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది.

మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ఇద్దరూ విడాకుల కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, దుబాయ్‌లో షోయబ్‌తో కలిసి ఉన్న ఇంటి నుంచి సానియా మరో ఇంటికి మారినట్టు కూడా వార్తలు వచ్చాయి. ‘బద్దలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయి’ అంటూ సానియా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు వారిద్దరూ వీడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూర్చింది. షోయబ్ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ షో ‘ఆస్క్ ద పెవిలియన్’లో కనిపించాడు. అక్కడతడిని సానియా టెన్నిస్ అకాడమీల గురించి ప్రశ్నించగా, వాటికి గురించి తనకు పెద్దగా తెలియదని బదులిచ్చాడు. అది విని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. ‘నువ్వేం భర్తవయ్యా బాబూ?’ అంటూ ఆశ్చర్యపోయాడు. షోయబ్ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వారి మధ్య దూరం పెరిగిందనడానికి ఉదాహరణగా చూపిస్తూ వార్తలు వైరల్ అయ్యాయి.

Updated Date - 2022-11-13T21:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising