ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: కవితకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు

ABN, First Publish Date - 2022-11-19T16:37:02+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మరింతగా ఉచ్చు బిగుస్తోంది. కవిత పాత్రపై సీబీఐ, ఈడీ (CBI ED) లోతుగా దర్యాప్తు చేపట్టాయి.

Kavitha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మరింతగా ఉచ్చు బిగుస్తోంది. కవిత పాత్రపై సీబీఐ, ఈడీ (CBI ED) లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఇఫ్తికర్‌ షరీఫ్‌తో కవితకు లింకులున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీబీఐ, ఈడీ బయటపెట్టనుంది. ఇప్పటికే పూర్తి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి. కవితతో పాటు ఆప్ నేత సోమనాథ్ భారతితో ఇఫ్తికర్‌కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇఫ్తికర్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో పలుమార్లు కవిత ప్రయాణించినట్లు చెబుతున్నారు. ఇఫ్తికర్‌తో కవిత సెల్ఫీలు దిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఇఫ్తికర్‌కు 20 ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు షరీఫ్ ఫామ్‌హౌస్‌లో విందులు, వినోదాలు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇతను నిత్యం రాజకీయ నేతలకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం ఉంది. త్వరలో ఇఫ్తికర్‌తో పాటు కవితను సీబీఐ, ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇదే కేసులో గతంలో కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు(Gorantla Butchibabu) నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) వ్యవహారం కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను కవిత ఖండించారు. తనకు ఎటువంటి నోటీసు రాలేదని ప్రకటించారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్విట్టర్‌లో విమర్శించారు. వాస్తవాలను చూపించడానికి సమయాన్ని వెచ్చించాలని మీడియా సంస్థలకు కవిత విజ్ఞప్తి చేశారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు.. తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేస్తున్నానని కవిత తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-19T16:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising