ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLAs Purchase: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదు: అర్వింద్

ABN, First Publish Date - 2022-11-10T17:02:14+05:30

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదని ఎంపీ అర్వింద్ (MP Arvind) ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Arvind
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదని ఎంపీ అర్వింద్ (MP Arvind) ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను టీఆర్‌ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని తప్పుబట్టారు. మోడీకి కనపడకుండా తప్పించుకునేందుకు.. కేసీఆర్ మరోసారి కావాలనే ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అర్వింద్ ఆకాంక్షించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి జిల్లాను గాలికొదిలేశారని మండిపడ్డారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పార్టీ పనులు వేగవంతం చేస్తామని, గడపగడపకు బీజేపీ నినాదంతో గ్రామాల్లో పర్యటిస్తామని అర్వింద్ తెలిపారు.

ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండంలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారు.

Updated Date - 2022-11-10T17:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising