TRS MLAs Purchase: నిందితుల పోలీస్ కస్టడీ కోసం పిటిషన్.. తిరస్కరించిన కోర్టు
ABN, First Publish Date - 2022-11-11T19:14:38+05:30
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs Purchase) కేసులో నిందితులను ఏసీబీ కోర్టు (ACB Court)లో పోలీసులు హాజరుపర్చారు. అయితే నిందితులను మరోసారి కస్టడీకి పోలీసులు కోరారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs Purchase) కేసులో నిందితులను ఏసీబీ కోర్టు (ACB Court)లో పోలీసులు హాజరుపర్చారు. అయితే నిందితులను మరోసారి కస్టడీకి పోలీసులు కోరారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. నిందితులకు ఈనెల 25 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులను రెండు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్ అధికారులు తీసుకున్నారు.
‘‘ఎవరి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారు? డీల్ వెనక ఉన్నదెవరు? నలుగురు టీఆర్‌ఎస్ (TRS) ఎమ్మెల్యేలను పరిచయం చేసిందెవరు? అసలు మీ ముగ్గురికి ఎలా పరిచయం? మొత్తం ఎంత మంది ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారు? డీల్ కుదిరితే.. వందల కోట్ల రూపాయలు ఇచ్చేదెవరు? డీల్ సక్సెస్ అయితే.. మీకు మిగిలేదెంత??’’ అంటూ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2022-11-11T19:14:39+05:30 IST