Directorate of Enforcement: ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
ABN, First Publish Date - 2022-12-16T13:55:47+05:30
పైలట్ రోహిత్‌రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి(MLA Pilot Rohith Reddy)కి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Heroine Rakul Preet Singh) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Directorate of Enforcement) నోటీసులు జారీ చేసింది.) టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్‌కు ఈ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు.
2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాత శంకర గౌడ ఇచ్చిన పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు, వ్యాపారులు హాజరయ్యారు. రియల్టర్ సందీప్ రెడ్డి, హీరో తనీష్ కూడా హాజరయ్యారు. నాటి పార్టీలో 4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఉపయోగించారని పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్టీకి సంబంధించి ఇద్దరు నైజీరియన్లను ఫిబ్రవరి 26న కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌తో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలున్నాయని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు భావిస్తున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు (TRS MLAs poaching case) లో రోహిత్ రెడ్డి ఇటీవలే వాగ్మూలం ఇచ్చారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్ సభ్యులుగా ఎంపిక చేశారు.
Updated Date - 2022-12-16T15:16:03+05:30 IST