Revanth Reddy: ఉత్తమ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారని సీపీ ఎలా చెప్తారు?
ABN, First Publish Date - 2022-12-18T20:31:34+05:30
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)కి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారని హైదరాబాద్ సీపీ ఆనంద్ (Hyderabad CP Anand) ఎలా చెప్తారు..
హైదరాబాద్: ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)కి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారని హైదరాబాద్ సీపీ ఆనంద్ (Hyderabad CP Anand) ఎలా చెప్తారు? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరా.. లేదా ఒక పార్టీ కార్యకర్తా అని నిలదీశారు. సొంత పార్టీ నేతలపైనే ఎవరైనా వ్యతిరేక పోస్ట్‌లు పెడతారా? అని ప్రశ్నించారు. ‘‘జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఎవరో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న ఎవరినో తిడితే నాకేం సంబంధం?.. ఎవరైనా తిడితే వారిని చెప్పుతీసుకొని కొట్టండి. కానీ నాపై అనవసర విమర్శలు చేయొద్దు. సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్ట్‌లను నాకు అంటకట్టకండి. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునేవాడిని.. మా పార్టీ నేతలపైనే వ్యతిరేక పోస్ట్‌లు ఎలా పెడతాను?... కావాలనే నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నాపై ఉన్న అపోహలు తీసేయండి.. నమ్మకంతో పనిచేయండి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే సమావేశం నిర్వహించామని, భారత్ జోడో పాదయాత్రపై సమావేశంలో చర్చించామని రేవంత్ తెలిపారు. ఈనెల 20 నుంచి 24 వరకు అన్నిజిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Updated Date - 2022-12-18T20:31:35+05:30 IST