ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్‌

ABN, First Publish Date - 2022-11-10T14:15:43+05:30

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇవాళ సిద్దిపేట పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం రావాల్సిందిగా సూచించారు. దీంతో రేపు మంత్రి సబిత గవర్నర్‌‌ను కలవనున్నారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై.. యూజీసీ, విద్యాశాఖ అధికారులతో తమిళిసై చర్చించనున్నారు.

కాగా తెలంగాణలో పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీలో నియామకాల బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబిత వ్యాఖ్యలకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్ ఇచ్చింది. ఈ నెల 7న (సోమవారం) మెసెంజర్ ద్వారా మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సమాచారం ఇచ్చామని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం రాజ్‌భవన్‌పై కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. పెండింగ్ బిల్లులు, యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డులో నియామకాలపై యూసీజీతోపాటు మంత్రి సబితకు లేఖ రాశామని, తక్షణమే రాజ్‌భవన్‌కు వచ్చి వాటన్నింటిపై వివరణ ఇవ్వాల్సిందిగా సమాచారం పంపించామని రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సమాచారం అందలేదని మంత్రి చెప్పడం సరికాదంది.

Updated Date - 2022-11-10T14:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising