Boora Narsaiah Goud: సొంత ఎమ్మెల్యేలను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు..
ABN, First Publish Date - 2022-11-16T13:14:42+05:30
హైదరాబాద్: సొంత ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.
హైదరాబాద్: సొంత ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల కోసం కూతురు పేరు వాడుకోవడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. కవితను ఆహ్వానించడం కాదు.. టీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోమన్నారు. ఫామ్‌హౌస్ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు జడ్జితోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు నిర్బంధించారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు.
నిజామాబాద్‌లో కవిత ఓటమి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందనే ఆరోపణలు ఉన్నాయని నర్సయ్యగౌడ్ అన్నారు. మరో పవర్ సెంటర్ కాకూడదన్న కారణంతోనే కవితను ఓడించారన్నారు. తొంభై శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవరని ఆయన జోస్యం చెప్పారు. సిట్ విషయంలో బీజేపీ ఆరోపణలే నిజమయ్యాయన్నారు. కేసీఆర్ హాయాంలో బీసీలు అణిచివేతను ఎదుర్కొంటున్నారని, బీసీల ఆర్థిక అణిచివేతకు ముఖ్యమంత్రే కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. బీసీ ఫెడరేషన్స్‌కు ఎనిదేళ్ళల్లో కేవలం రూ. 230 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. బీసీ ఫెడరేషన్స్‌కు చట్టబద్ధత కల్పించకుంటే.. ఉద్యమం తప్పదని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
Updated Date - 2022-11-16T13:14:46+05:30 IST