Suprestar Krishna మృతికి తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం

ABN, First Publish Date - 2022-11-15T09:27:37+05:30

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Suprestar Krishna మృతికి తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై, బిశ్వభూషణ్, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్, కేటీఆర్, రేవంత్‌రెడ్డి, శైలజానాథ్, సీపీఐ రామకృష్ణ, తులసిరెడ్డి, ఎలమంచలి శివాజీ సంతాపం తెలిపారు. అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, తలసాని, ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని శ్రీనివాస్, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీడీపీ నేతలు సోమిరెడ్డి, కాసాని, రావుల, అర్వింద్‌కుమార్ గౌడ్, సీపీఐ నారాయణ సంతాపం ప్రకటించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, కృష్ణ మేకప్‌ మాన్ చేబ్రోలు మాధవరావు కృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు.

కాగా.. ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంట్ హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. ఈరోజు తెల్లవారుజామున కృష్ణ పరిస్థితి మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-11-15T09:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising