ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth reddy: కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రేవంత్..

ABN, First Publish Date - 2022-12-28T12:34:29+05:30

హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (of Congress Party 138th Foundation Day Celebrations ) ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణు గోపాల్, సేవదల్ చీఫ్ ప్రసాద్, గడ్డం వినోద్, రామచంద్రారెడ్డి, వినోద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, రోహిన్ రెడ్డి, సమీర్ ఉల్లా, అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు మెట్టు సాయి, నూతి శ్రీకాంత్, సునీతా రావ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు, అందరికీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని, ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ (Indira Gandhi) పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని, దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని కొనియాడారు. నేతలను బలిగొన్నా దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్‌ను నిలబెట్టారన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా ఆనాడు బీజేపీ (BJP) అడ్డుకుందని రేవంత్ విమర్శించారు. తెలంగాణలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమేనన్నారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర చేపట్టారని అన్నారు. దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోదీ (PM Modi) ఉన్నారని, రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోదీ ప్రభుత్వానికి పట్టింపు లేదని దుయ్యబట్టారు.

సీఎం కేసీఆర్ (KCR) చేతిలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’కు ప్రజలు కడలిరావాలని పిలుపిచ్చారు. అలాగే వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని పార్టీ శ్రేణులను కోరుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - 2022-12-28T12:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising