ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: టి.కాంగ్రెస్‌లో హై టెన్షన్.. ఢిల్లీ రావాలని సీనియర్లకు పిలుపు..

ABN, First Publish Date - 2022-12-18T11:11:21+05:30

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ (T.Congress)లో హై టెన్షన్ (High Tension) నెలకొంది. కొత్త కమిటీల కూర్పు కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ (T.Congress)లో హై టెన్షన్ (High Tension) నెలకొంది. కొత్త కమిటీల కూర్పు కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై పార్టీ సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కమిటీల వివాదం తేల్చేవరకు రేవంత్ కార్యక్రమాలను బాయ్‌కాట్ (Boycott) చేయాలని నిర్ణయించారు. సేవ్ కాంగ్రెస్ పేరిట సీనియర్లు ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో మరో సమావేశం పెడుతున్నారు.

కాగా ఆదివారం గాంధీ భవన్‌లో పీసీపీ కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉంది. ఏఐసీపీ అదేశాల మేరకు జనవరి 26 నుంచి చేపట్టే హాథ్ మే హాథ్ జోడో యాత్రపై చర్చించనున్నారు. ఈ పీసీసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని సీనియర్లు డిసైడ్ అయ్యారు. సీనియర్ల నిర్ణయంతో పీసీసీ కార్యవర్గ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో టి.కాంగ్రెస్ పంచాయితీపై హై కమాండ్ ఫోకస్ పెట్టింది. జరుగుతున్న పరిణామాలపై హస్తిన పెద్దలు ఆరా తీస్తున్నారు. సీనియర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సీనియర్లు ఢిల్లీకి రావాలంటూ అధిష్టానం పిలుపిచ్చింది.

Updated Date - 2022-12-18T11:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising