kavitha: బీఆర్ఎస్తో బీజేపీ ఉలిక్కిపడింది
ABN, First Publish Date - 2022-12-01T15:08:00+05:30
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్‌గా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సాఆర్టీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. కౌంటర్‌కు ప్రతి కౌంటర్‌గా నువ్వానేనా?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్‌గా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సాఆర్టీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. కౌంటర్‌కు ప్రతి కౌంటర్‌గా నువ్వానేనా? అన్నట్టుగా కల్వకుంట్ల కవిత-షర్మిల-బీజేపీల మధ్య డైలాగ్ వార్ హీట్ పెంచుతోంది. ఓ వైపు షర్మిల.. గవర్నర్ తమిళిసైను కలిసి ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయగా... మరోవైపు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మాటల దాడి కొనసాగించారు.
కవిత ట్వీట్..
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో బీజేపీ ఉలిక్కిపడేలా చేసిందని విమర్శించారు. బీజేపీ చౌకబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రయత్నం చేయడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పనిచేయవని హితవు పలికారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని మమ్మల్ని ఏ శక్తి ఆపలేదని కవిత వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-01T15:13:13+05:30 IST