ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Racing League: ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మరో ప్రమాదం

ABN, First Publish Date - 2022-11-20T16:18:43+05:30

ఇండియన్ రేసింగ్ లీగ్‌ (Indian Racing League)లో మరో ప్రమాదం జరిగింది. చెన్నై టర్బోరైడర్స్‌ (Chennai Turboriders) కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్‌ (Indian Racing League)లో మరో ప్రమాదం జరిగింది. చెన్నై టర్బోరైడర్స్‌ (Chennai Turboriders) కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. మహిళా రేసర్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ రేసర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఎన్టీఆర్ మార్గ్‌ (NTR Marg)లో ప్రమాదం జరిగింది. హుస్సేన్‌సాగర్‌ తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ట్రయల్‌ ఆకట్టుకుంది. శనివారం కార్ల రేస్‌ ఉత్కంఠగా సాగింది. రెప్పపాటు వేగంతో దూసుకెళ్లిన కార్లను చూసి చాలా మంది సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 2.7 కిలోమీటర్ల రేసింగ్‌ ట్రాక్‌పై శనివారం మధ్యాహ్నం కార్లు దూసుకెళ్లాయి.

గరిష్ఠంగా 260 కిలోమీటర్ల వేగం

ఈ లీగ్‌లో పాల్గొన్న కార్లన్నీ పెట్రోలుతో నడిచేవి. కారు గరిష్ఠ వేగం 260 కిలోమీటర్లు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ను ఒక్కో కారు నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషంలో చుట్టి వచ్చేశాయి. రెప్పపాటుతో దూసుకెళ్తున్న కార్లను ఫోన్లలో బంధించేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారు. ఎలక్ర్టికల్‌ కార్లయితే గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పురుషులతో పోటీ పడి మహిళా రేసర్లు రయ్యుమంటూ కార్లను నడిపారు. కార్లు దూసుకెళ్తున్న శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది.

పకడ్బందీగా ఏర్పాట్లు

రేస్‌ కారు అదుపు తప్పినా బయటకు దూసుకురాకుండా ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 15 అడుగుల మేర భారీ ఇనుప కంచెను ఉంచారు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై 17 మలుపులున్నాయి. ప్రతీ మలుపు వద్ద ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పదికి పైగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. అవసరమైతే అత్యవసర చికిత్స అందించే వైద్య సిబ్బందిని నియమించారు.

Updated Date - 2022-11-20T16:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising