Marri Rajashekar reddy: ఐటీ విచారణకు హాజరవుతా
ABN, First Publish Date - 2022-11-28T10:28:59+05:30
ఐటీ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ఐటీ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి (Minister Mallareddy son in law Marri Rajashekar reddy ) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు తనకు సమన్లు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులో హాజరు అవ్వాలి అని మాత్రమే పేర్కొన్నారని... ఎటువంటి డాక్యుమెంట్స్, బ్యాంక్ లావాదేవీలు తీసుకు రావాలని సూచించలేదని అన్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్నారు. తనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఐటీ విచారణకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తన ఇంట్లో దొరికిన లిక్విడ్ క్యాష్ గురించి ఐటీ అధికారులకు వివరణ ఇస్తానని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన రూ.4కోట్ల నగదును సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐటీ దాడుల సమయంలో రాజశేఖర్ రెడ్డి టర్కీలో ఉన్నారు. దాడుల విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన నగరానికి వచ్చారు.
Updated Date - 2022-11-28T10:29:00+05:30 IST