ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

moinabad farm house: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్ట్‌లు..!

ABN, First Publish Date - 2022-11-13T16:49:22+05:30

ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. ఏపీ, హర్యానా, కేరళ (Haryana Kerala), కర్ణాటకతో పాటు హైదరాబాద్‌లో సిట్‌ తనిఖీలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. ఏపీ, హర్యానా, కేరళ (Haryana Kerala), కర్ణాటకతో పాటు హైదరాబాద్‌లో సిట్‌ తనిఖీలు చేస్తున్నారు. 7 బృందాలుగా సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హర్యానా, కర్ణాటకలోని రామచంద్రభారతి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే తిరుపతి (Tirupati)లోని సింహయాజీ స్వామీజీ ఆశ్రమంలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేరళలో ఓ వైద్యుడి ఇంట్లో సిట్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. రామచంద్రభారతికి కొచ్చిలో ఉండే వైద్యుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో పలు కీలక పత్రాలను సిట్ బృందం స్వాధీనం చేసుకున్నారు. సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఓ జాతీయ పార్టీ నేత బంధువు ఫ్లైట్‌ టికెట్ బుక్ చేసినట్లు సిట్ గుర్తించారు.

నందు ఇల్లు, హోటల్‌లో సోదాలు

ఎమ్మెల్యేలతో బేరసారాల కేసులో ఏ-2గా ఉన్న నందకుమార్‌ ఇల్లు, హోటల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సిట్‌ బృందం శనివారం సోదాలు నిర్వహించింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసే ముందు కూడా వారంతా షేక్‌పేట్‌లోని నందు ఇంట్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అక్కడ ఆధారాల కోసం తనిఖీలు జరిపి, సీసీటీవీ ఫుటేజీ వంటి పలు ఆధారాలను సేకరించింది. నందు నిర్వహిస్తున్న ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ హోటల్‌లోనూ సిట్‌ బృందాలు సోదాలు నిర్వహించాయి.

నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపులు

ఈ కేసులో ఫిర్యాది అయిన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి (Pilot Rohit Reddy)తోపాటు.. సహ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌ రెడ్డి, రేగా కాంతారావుకు కొద్ది రోజులుగా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వారంతా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంపు కార్యాలయాల వద్ద నిఘా పెంచారు. సోషల్‌ మీడియాలోనూ బెదిరింపు పోస్టింగ్‌లపై దృష్టి సారించారు.

Updated Date - 2022-11-13T16:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising