ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mynampally Hanumantha Rao: మంత్రి మల్లారెడ్డికి సెగ.. పదవి నుంచి పీకేయాలంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే..

ABN, First Publish Date - 2022-12-19T15:47:24+05:30

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రహస్యంగా సమావేశం నిర్వహించడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రహస్యంగా సమావేశం నిర్వహించడం కలకలం రేపింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ (MLA Arekapudi Gandhi), వివేక్, మాధవరం కృష్ణారావు, బి.సుభాష్ రెడ్డి హాజరు కావడం గమనార్హం. అయితే.. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యే మైనంపల్లి చెప్పినప్పటికీ.. మంత్రి మల్లారెడ్డిపై (Minister Mallareddy) అసమ్మతితోనే సమావేశమయ్యారని పార్టీ శ్రేణులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఆదివారం నాడు ఓ వివాహ వేడుకలో మైనంపల్లి, మల్లారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దని కలెక్టర్‌కు మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన ఆదేశాలివ్వడంతో ఎమ్మెల్యే మైనంపల్లి ఫైర్ అయ్యారు.

మంత్రి ప్రొటోకాల్‌ పాటించడం లేదని, రాత్రికి రాత్రే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను మార్చారని మైనంపల్లి తాజాగా వాపోయారు. తమ కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అందరికి అవకాశం ఇవ్వలేకపోయామని.. ఒక్క నియోజకవర్గానికే పదవులు ఇస్తే ఎలా అని మైనంపల్లి మంత్రి మల్లారెడ్డి వైఖరిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉన్నామని, తమది రహస్య సమావేశం కాదని ఎమ్మెల్యే వివేక్‌ కుండబద్ధలు కొట్టారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి అంశాన్ని మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, కానీ తొందరపడి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్‌ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, మంత్రి మల్లారెడ్డి తమను పట్టించుకోవడం లేదని మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పదవులు అన్ని ఒకే నియెజకవర్గానికి వెళ్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా పదవులన్నీ కూడా మంత్రి తీసుకెళ్లి పోతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. నామినేటెడ్‌ పదవులు తమ కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసుకుంటే.. మంత్రి మల్లారెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఈ ఎమ్మెల్యేలంతా సమావేశమైనట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలను ప్రస్తావించినట్లు కూడా తెలిసింది. మంత్రి పదవి నుంచి మల్లారెడ్డిని తొలగించాలని అధిష్టానానికి విన్నవించాలని సమావేశమైన ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఆ స్థానం మైనంపల్లికి ఇవ్వాలని మిగిలిన ఎమ్మెల్యేలు సూచించనున్నట్లు కూడా సమాచారం. మల్లారెడ్డి తీరు, వివాదాలను ఎమ్మెల్యేలు ఎత్తిచూపుతున్నారు. మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ.

ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల భేటీపై హైకమాండ్‌ కూడా స్పందించడం గమనార్హం. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధి ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ నుంచి పిలుపు అందినట్లు టాక్. ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు సమాచారం అందినట్లు తెలిసింది. మంత్రి మల్లారెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేక్, మాధవరం కృష్ణారావు, బి.సుభాష్‌రెడ్డి సమావేశం కావడం బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చర్చకు దారితీసింది.

Updated Date - 2022-12-19T15:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising