ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanthreddy: రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి...

ABN, First Publish Date - 2022-11-21T15:41:25+05:30

సీఎస్ సోమేష్‌ కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎస్‌ను కలిసినవారిలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎస్ సోమేష్‌ కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎస్‌ను కలిసినవారిలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ధరణిని రద్దు చేసి పాతపద్ధతిని తీసుకురావాలని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు అసైన్డ్‌ పట్టాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణలో కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని వినతిచేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

రైతు, భూ సమస్యలపై సీఎస్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కూర్చోడానికి సచివాలయం లేదు. కలవడానికి సీఏం లేరని విమర్శించారు. ధరణి పోర్టల్ వల్ల ఆస్తుల వివరాలు ప్రయివేట్ వ్యక్తుల చేతుల నుంచి దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భూములున్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం కొల్లగొట్టిందని, పోడుభూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనుల పొట్ట కొడుతోందని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ నెల 24న అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీసుల ముందు బాధితులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-21T15:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising