ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ..

ABN, First Publish Date - 2022-12-17T14:34:49+05:30

సీఎం కేసీఆర్‌ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ (Letter) రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై ఆయన లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ (Letter) రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై ఆయన లేఖ రాశారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ (TRS) పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిల్చారని విమర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని.. హైకోర్టు (High Court) తీర్పు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభ్యర్థులు తమ ఆవేదనను ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ (KTR), డీజీపీ (DGP)కి విన్నవించుకున్నా సమాధానం రాలేదన్నారు. సంబంధిత శాఖను చూస్తే అసలు హోంమంత్రి ఉన్నారో లేదో తెలియదన్నారు. ఇవేమీ పట్టనట్టు సీఎం బీఆర్ఎస్ (BRS) అంటూ దేశమంతా తిరుగుతున్నారని, పాలన ఈ విధంగా ఉంటే ఉద్యోగార్థుల సమస్యను తీర్చేదెవరని ప్రశ్నిస్తూ లేఖ రాశారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి.. అభ్యర్ధులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్ధులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందని రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-17T14:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising