Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్ఎస్...
ABN, First Publish Date - 2022-12-09T13:43:43+05:30
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు (Chief Minister KCR formally launched BRS). మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్‌ఎస్ పత్రాలపై కేసీఆర్ (Telangana CM) సంతకాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. ఆపై బీఆర్‌ఎస్ జెండాను అధినేత ఆవిష్కరించారు. గులాబీ రంగులోనే పార్టీ జెండాను రూపొందించారు. జెండా మధ్యలో తెలంగాణ స్థానంలో భారత్‌దేశం మ్యాప్‌తో బీఆర్‌ఎస్ జెండా (BRS Flag)ను రూపొందించారు. పార్టీ జెండాపై జై తెలంగాణ బదులు.. జై భారత్‌గా మార్చారు. జెండా ఆవిష్కరణ ముందే కండువాను ఆవిష్కరించిన కేసీఆర్... తనకు తానుగా కండువాను మెడలో వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాష్‌రాజ్, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
Updated Date - 2022-12-09T15:14:00+05:30 IST