Seethakka: ఆ పదం చాలా బాధ కలిగించింది

ABN, First Publish Date - 2022-12-22T17:29:29+05:30

వలసవాదులు అనే పదం వాడటం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ సీతక్క (Seethakka) ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పదం ఎందుకు వాడారో వాళ్లకే తెలియాలన్నారు.

Seethakka: ఆ పదం చాలా బాధ కలిగించింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వలసవాదులు అనే పదం వాడటం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ సీతక్క (Seethakka) ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పదం ఎందుకు వాడారో వాళ్లకే తెలియాలన్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) మాట్లాడాక కాంగ్రెస్‌లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ తనకు చాలా స్పేస్ ఇచ్చిందని సీతక్క తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయితీ ముదిరి పాకాన పడింది. టీపీసీసీ నూతన కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇచ్చారన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) తదితర సీనియర్‌ నేతల ఆరోపణలపై రేవంత్‌రెడ్డి వర్గం తీవ్రంగా స్పందించింది. సీతక్క సహా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది నేతలు పీసీసీ కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కలహాలను చక్కదిద్దేందుకు ఏఐసీసీ పరిశీలకుడిగా నియమితుడైన సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ తన కార్యాచరణ మొదలుపెట్టారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన గురు, శుక్రవారంలో అసంతృప్తి నేతలతో సమావేశమవుతారు. అసంతృప్త నేతలతోపాటు రేవంత్‌ వర్గం నేతలతో కూడా దిగ్వజయ్ మాట్లాడనున్నారు.

Updated Date - 2022-12-22T17:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising