Home » Thammineni Seetharam
రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
Andhrapradesh: అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద విచారణకు మరోసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. తాము విచారణకు హాజరుకావడం లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
Andhrapradesh: ఉత్తరాంధ్ర నుంచి శాసనసభకు స్పీకర్‌గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతాారాం అన్నారు. ఏపీ అసెంబ్లీ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేడు టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు.
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.
సమన్వయం, ఓర్పుతో సభను సజావుగా నడిపించాల్సిన స్పీకర్ అనుచితంగా వ్యవహరిస్తే సభలు ఎంతటి పరిహాసమవుతాయో అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే నేటి (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly). ‘‘ వాట్ ఈజ్ దిస్. యా.. పో.. త్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’’... అంటూ విపక్ష సభ్యులైన టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యహించుకుంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి.
అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభా స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారని, ఈ స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేసారని అన్నారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే.. అది ప్రభుత్వ మాటగానే పరిగణించాలి. నేడు డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సందర్భం కూడా లేకుండా ఆయన చంద్రబాబు భద్రత గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.