ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan reddy: స్వామీజీలు, బ్రోకర్లు మాకు అవసరమా?

ABN, First Publish Date - 2022-11-04T14:14:20+05:30

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత శ్లోకాతప్త హృదయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) తర్వాత శ్లోకాతప్త హృదయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రెస్ మీట్ పెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..నిన్నటి కేసీఆర్(Telangana CM) వ్యాఖ్యలు ఊహాజనితమే అని తేల్చిపారేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల(TRS MLAs purchase)ను కొనాలని గానీ, ప్రభుత్వాన్ని పడగొట్టాలని గానీ.. వీడియోలో ఎక్కడా సంభాషణలు లేవన్నారు. నిన్నటి కేసీఆర్ (TRS Chief)సినిమా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని యెద్దేవా చేశారు. అసహనం, ఆక్రోశం, అభద్రతాభావాన్ని కేసీఆర్ వ్యక్తపరిచారని అన్నారు. ‘‘ఇతర పార్టీలను చేర్చుకోవాలనుకుంటే మాకు ఆ శక్తిలేదా?. స్వామీజీలు, బ్రోకర్లు మాకు అవసరమా?. మా సిద్దాంతాలు నచ్చి వచ్చినవారినే తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. అడ్డదారిలో ఎంపీ, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న చరిత్ర కేసీఆర్‌దే అని విరుచుకుపడ్డారు. ఒక్కరితోనైనా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారా? అని కేంద్రమంత్రి (Union minister)ప్రశ్నించారు.

తెలంగాణ(Telangana)లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నెలలో 15 రోజులు ఫామ్‌హౌస్‌ (TRS MLAs case)లో ఉండే కేసీఆర్‌ నుంచి..తాము ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలా అంటూ యెద్దేవా చేశారు. సామాన్య ప్రజలను కేసీఆర్ ఎప్పుడైనా కలిశారా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం (TRS government) పడిపోవాలన్న ఉద్దేశం తమకు లేదని... టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తామన్నా చేర్చుకోమని తేల్చిచెప్పారు. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) జరుగుతాయన్నారు. కేటీఆర్‌ సీఎం కాలేడేమోనని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. కోర్టులు, ఈసీ, సీఎంలు, చట్ట సభలకు కొనుగోలు వీడియోలు పంపామంటున్నారని... ఆ వీడియోల్లో తమ వాళ్లు ఎవరున్నారని పంపారని ప్రశ్నించారు.

ఆ వీడియోల్లో ఏమీ లేదు....

ఫామ్‌హౌస్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్‌గా కేసీఆర్ ది ఏ పార్టీ అని ప్రశ్నించారు. జయప్రకాష్‌ నారాయణ పేరెత్తే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌ ప్రదర్శించిన వీడియోల్లో ఏమీ లేదన్నారు. ఫామ్‌హౌస్‌ విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని తెలిపారు. తెలంగాణలో అధికారులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ల ట్యాప్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-04T14:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising