ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: బీఆర్ఎస్‌తో దేశానికి భారమే..

ABN, First Publish Date - 2022-12-09T22:31:32+05:30

మొన్నటి వరకూ టీఆర్ఎస్‌(TRS)గా ఉండి.. నిన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్‌)(BRS)గా మారిన ఈ పార్టీ వల్ల దేశానికి మరింత భారమే తప్ప మరొకటి కాదని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మొన్నటి వరకూ టీఆర్ఎస్‌(TRS)గా ఉండి.. నిన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్‌)(BRS)గా మారిన ఈ పార్టీ వల్ల దేశానికి మరింత భారమే తప్ప మరొకటి కాదని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు. శుక్రవారం సోషల్ మీడియా(Social media) లో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు. ఆ వార్తను యథప్రకారం ఇస్తున్నాం. ‘‘టీఆర్ఎస్‌ పేరు మార్పు అన్నది ఏదో గొప్ప ఘనకార్యంలాగా... అప్పుడే జాతీయ పార్టీ అయిపోయినట్లు సీఎం కేసీఆర్(CM KCR) చేస్తున్న హడావుడి చూస్తుంటే బొమ్మల పెళ్లి చేసి ఉత్తుత్తి భోజనాలతో సంబరపడే పిల్లలాట గుర్తుకొస్తోంది. గత ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దారుణంగా అప్పుల పాలు చేసి ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరడం హాస్యాస్పదం. సాగు సమస్యలతో రైతులు, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పేదలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమీ పాలుపోక... తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక బీఆర్ఎస్‌ అంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు . తెలంగాణ పేరు వింటేనే ఆయనకు ఆ అప్పులు, ఆత్మహత్యలే గుర్తుకొస్తుండడంతో చివరికేం చేయాలో తెలియక పార్టీ పేరు నుంచే తెలంగాణ అన్న పదాన్ని తొలగించినట్లు అర్ధమవుతోంది. అదే తీరున రాష్ట్ర ప్రజలు కూడా గులాబీ దళాన్ని అధికారం నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తెరగాలి’’ అని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2022-12-09T22:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising