ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఢిల్లీలో కేసీఆర్ హడావుడి తుస్సుమంది

ABN, First Publish Date - 2022-12-17T22:45:14+05:30

బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) చేసిన హడావుడి తుస్సుమందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) చేసిన హడావుడి తుస్సుమందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు. యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి తప్ప ఎన్సీపీ, జేడీ(యూ), ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ అక్కడ కనిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యథాతథంగా..

'బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చేసిన హడావుడి తుస్సుమంది. యూపీ, కర్ణాటకల మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి తప్ప ఎన్సీపీ, జేడీ(యూ), ఆమ్ ఆద్మీ, తృణముల్, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ అక్కడ కనిపించలేదు. బీఆరెస్ వర్గాలు ఏకంగా ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినా జాతీయ మీడియా గాని, రాజకీయ వర్గాలు గాని ఈ పార్టీ ఊసెత్తితే ఒట్టు. తెలుగు మీడియా తప్ప చివరికి సోషల్ మీడియా కూడా బీఆరెస్‌ని పట్టించుకోలేదు. గతంలో పలుమార్లు కేసీఆర్ గారిని కలిసిన రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ కూడా ముఖం చాటేశారు. నిజంగా దేశానికి సేవ చేయాలనే భావంతో ప్రజల్లోకి వెళితే ఆదరణ వస్తుంది తప్ప... అధికార దాహం, స్వార్థప్రయోజనాల కోసం పార్టీ పేరు మార్చి యాగాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని బీఆరెస్ అధినేత గ్రహించాలి.' అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2022-12-17T22:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising