Vijayashanthi: వీఆర్ఏల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోంది
ABN, First Publish Date - 2022-11-25T22:08:27+05:30
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుందని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వారి సమ్యసలను పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకుందని ఆమె మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా...
''కేసీఆర్ సర్కార్ వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వారి సమ్యసలను పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. తప్ప కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. వారు ఇప్పుడు ఏం చేయాలో తెలీక అయోమయంతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. మునుగోడు ఎన్నిక జరిగి వారాలు గడుస్తున్న కేసీఆర్ సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. వీఆర్ఏలు 83 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పుడే మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో కేసీఆర్ సర్కార్ వీఆర్ఏలపై కంత్రి డ్రామాకు తెరదీసింది. ఏం కేసీఆర్ నీకు కాసంతనైన దయలేదా..? ఆమాయకులైన వీఆర్ఏల జీవితాలతో ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు. కేసీఆర్ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ కూడా బతికి బట్ట కట్టినట్లు చరిత్రలో లేదు. వారే మీకు, మీ సర్కార్ కు తగిన సమాధానం చెబుతారు.'' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2022-11-25T22:11:04+05:30 IST