ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: తెలంగాణ కొత్త డీజీపీగా ఐదుగురి పేర్లతో యూపీఎస్సీకి చేరిన జాబితా

ABN, First Publish Date - 2022-12-28T14:03:54+05:30

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర కొత్త డీజీపీ (New DGP) ఎవరన్నది ఉత్కంఠగా మారింది. డీజీపీ రేసులో ఐదుగురు సీనియర్ అధికారులు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర కొత్త డీజీపీ (New DGP) ఎవరన్నది ఉత్కంఠగా మారింది. డీజీపీ రేసులో ఐదుగురు సీనియర్ అధికారులు ఉన్నారు. పోలీస్ బాస్‌గా ఎవరు వస్తారన్నది సిబ్బందిలో ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) పదవీ కాలం ఈ నెల 31తో ముగుస్తుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assemble Elections) రానున్నాయి. దీంతో డీజీపీ నియామకంపై ఉత్కంఠత నెలకొంది. సీనియారిటీ ప్రాతిపదికన ఐగుదుగురు ఉన్నతాధికారుల పేర్లతో జాబితా ఇప్పటికే యూపీఎస్సీ (UPSC)కి చేరింది. వారిలో ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్రానికి యూపీఎస్సీ సూచన చేయనుంది. అయితే డీజీపీ రేసులో 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత ఏసీబీ డీజీ అంజనీ కుమార్ (Anjani Kumar), 1989 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రవిగుప్తా (Ravi Gupta) రేసులో ఉన్నారు. వారితో పాటు మరో ముగ్గురు ఐపీఎస్‌లు పోటీపడుతున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand), అడిషనల్ డీజీ జితేందర్ (Jitender), రాజీవ్ రతన్ (Rajeev Ratan) కూడా రేసులో ఉన్నారు. ఈ ఐదుగురిలో డీజీపీ పోస్టు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2022-12-28T14:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising