ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: తమిళిసై విందుకు కేసీఆర్ దూరం

ABN, First Publish Date - 2022-12-26T20:46:20+05:30

ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌కు మరింత దూరం పెరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది కోసం తెలంగాణ (Telangana)కు వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌కు మరింత దూరం పెరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది కోసం తెలంగాణ (Telangana)కు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై (Tamilisai) విందు ఇచ్చారు. అయితే గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. గవర్నర్ విందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు (Hakimpet Airport)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం కేసీఆర్ (CM KCR) స్వాగతం పలికారు. కేసీఆర్‌తో పాటు రాష్ట్రపతి ముర్ముకు ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, బాలరాజ్, హర్షవర్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వెళ్లిన సమయంలో గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడారు. ఇద్దరు మాట్లాడుకోవడంతో ఇక నుంచి ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్ తొలగిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ.. షెడ్యూల్‌లో లేదనే కారణంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం గవర్నర్‌తో ఆ గ్యాప్ కొనసాగుతుందనే సంకేతాలకు కారణమైంది.

Updated Date - 2022-12-26T20:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising