ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLA poaching case: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-11-09T19:01:39+05:30

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

kcr
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసును చేధించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.

హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohit Reddy) (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (Rega Kantha Rao) (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

స్వామిజీలపై మరో కేసు నమోదు

ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మతోపాటు తిరుపతికి చెందిన సింహయాజిపై మరో కేసు నమోదైంది. వీరిద్దరూ వేర్వేరు పేర్లతో ఆధార్‌, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొందారని పైలెట్‌ రోహిత్‌ రెడ్డి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మునుగోడు పోలింగ్‌ అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రామచంద్ర భారతి వేర్వేరు పేర్లతో పొందిన ఆధార్‌, పాన్‌కార్డులను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కాగా... కేసులో ఎ-3గా ఉన్న సింహయాజి చంచల్‌గూడ జైల్లో అవస్థలు పడుతున్నారు. సుమారు 160 కేజీలకుపైగా భారీ కాయంతో ఉన్న సింహయాజి... జైల్లో ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారు. ఊబకాయం కారణంగా కూర్చునేందుకు, లేచి నిలబడేందుకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైలు అధికారులు ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. దీంతో జైలుకు వచ్చిన మొదట్లో ఒకట్రెండు రోజులు ముభావంగా ఉన్న సింహయాజి... ఆ తర్వాత సాధారణ ఖైదీల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. మరోవైపు... ముగ్గురు నిందితులు ఒకే జైల్లో ఉన్నా, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుసుకునేందుకు వీల్లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలు నిబంధనల మేరకు ములాఖత్‌ సదుపాయం కల్పిస్తున్నారు.

Updated Date - 2022-11-09T19:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising