Sambasivarao: టీఆర్ఎస్‌తో పొత్తు అందుకే..
ABN, First Publish Date - 2022-12-13T13:03:35+05:30
దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలు కాకుండా కలెక్టర్లు ఎంపిక చేసేలా బాధ్యతలు అప్పగించాలని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దేశంలో బీజేపీ ఓటమి జర్నీ మొదలైందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Koonanneni Sambasivarao) పేర్కొన్నారు. సీపీఐ(CPI) పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉన్న పరిశ్రమలను బీజేపీ అమ్మకాలకు పెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ(BJP) ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీని నిలువరించడానికే టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 119 నియోజకవర్గ పరిధిలో సీపీఐ పార్టీని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుపొందేందుకు సీపీఐ కృషి చేస్తుందని వెల్లడించారు. కేసీఆర్(CM KCR) ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలు కాకుండా కలెక్టర్లు ఎంపిక చేసేలా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని సాంబశివరావు కోరారు.
Updated Date - 2022-12-13T13:03:37+05:30 IST