Minister Niranjan Reddy: పేదలకు అండగా కేసీఆర్ సర్కార్
ABN, First Publish Date - 2022-12-16T12:37:48+05:30
పేదలకు అండగా కేసీఆర్ సర్కార్ ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి: పేదలకు అండగా కేసీఆర్ సర్కార్ ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Singireddy Niranjan Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 232 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ... కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరమన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమంలో తెలంగాణ (Telangana State) దేశంలోనే నంబర్ వన్ స్థానంగా ఉందన్నారు. తెలంగాణ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శమన్నారు. ప్రపంచదేశాలకు భారతదేశాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. నాడు రాష్ట్రం టీఆర్ఎస్... నేడు దేశంకోసం బీఆర్ఎస్ అని అన్నారు. రైతును రాజును చేయడమే బీఆర్ఎస్ విధానమన్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతామని తెలిపారు. రైతు రాజ్య స్థాపన కోసం రాజీలేని పోరాటం చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T12:38:36+05:30 IST