ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chiranjeevi and Garikapati: ‘ఆయన ఇక్కడ లేరు కదా..’ వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-10-29T10:58:19+05:30

తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఇప్పుడాయనే సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా...

Megastar Chiranjeevi at Shunyam Nundi Shikaragralu Book Launch
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఇప్పుడాయనే సినీ పరిశ్రమ మొత్తానికి పెద్ద దిక్కుగా మారారు. తనకు ఆ ‘పెద్ద’ అనే బాధ్యతలు వద్దు అంటూనే సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా.. నేనున్నాను అంటూ భుజం కాస్తానని మాటిచ్చారు. మాట ఇచ్చినట్లే ఆయన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. కుర్ర హీరోలకు (Young Heroes) సైతం పోటీ ఇస్తూ తన చరిష్మాతో తెలుగు సినీ పరిశ్రమని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఎంతోమందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఎంతోమంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమకు వచ్చారంటే అతిశయోక్తి కాదు. సామాన్య ప్రేక్షకులకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చిరంజీవి (Chiranjeevi) పేరు చెబితే దేనికైనా రెడీ అనే అభిమాన గణాన్ని ఆయన సంపాదించుకున్నారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు (Senior Journalist Prabhu) ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ (Shunyam Nundi Shikaragralu Book) అనే పుస్తకాన్ని రచించి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవగా.. గిరిబాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, ఉత్తేజ్ వంటి ఎందరో ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో కూడా (ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో కూడా చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు ఎగబడిన విషయం తెలిసిందే) మెగాస్టార్‌తో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపించడం చర్చనీయాంశమైంది. వారంతా సినీ పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు అలాగే పలువురు ఉన్నతాధికారుల భార్యలు. అయితేనేమి మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. మెగాస్టార్ చిరంజీవి హాజరైన కార్యక్రమానికి తాము హాజరవుతున్నామని ఆనందంతో వచ్చిన వారందరికీ.. ఆయనతో ఫోటో దిగే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే వెళ్లి ఆయనతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరిని నొప్పించరు అనే విషయం మనందరికీ తెలుసు. దీంతో ఆయన కూడా ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలానే తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటే గరికపాటి (Garikapati) చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ ‘ఆయన ఇక్కడ లేరు కదా..’ అంటూ చిరు ఛలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడికి సామాన్యులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు, వారి భార్యలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వారందరూ మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. గరికపాటివారు ఆ ఫొటో సెషన్ ఆపాలంటూ సీరియస్ అయ్యారు. వెంటనే పెద్దాయన మాటకు గౌరవమిస్తూ.. మెగాస్టార్ ఫొటో సెషన్ ఆపేసి.. ఆయన పక్కకు వచ్చి కూర్చున్నారు. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం ఇది అంటూ.. అప్పుడే అందరూ మెగాస్టార్ అంటే ఇది అంటూ కొనియాడారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనంగా.. ఈ వేడుక నిలిచింది.

Updated Date - 2022-10-29T11:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising