ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలందించాలి

ABN, First Publish Date - 2022-11-04T01:32:30+05:30

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ యాప్‌పై అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు.

సమావేశంలో పాల్గొన్న అంగన్‌వాడీ సిబ్బంది, మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 3: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ యాప్‌పై అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్ర ంలో అందించే సేవల వివరాలు, నెలవారీ నివేదికలు, లబ్ధిదారుల పూర్తి వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలన్నారు. దీని ద్వారా ప్రతీ రోజు కేంద్రానికి వచ్చే లబ్ధిదారులు పొందుతున్న సేవలు, ఎన్ని రోజులు సేవలు పొందారనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్టర్లను ఉపయోగించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాప్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. యాప్‌ ద్వారా పిల్లల బరువు, పెరుగుదల, పోషణలోపం తెలుసుకోవచ్చన్నారు. అనంతరం పోషక విలువలు, విధి విధానాలకు సంబంధించి రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ జ్యోతి పద్మ, ఐటీ కోఆర్డినేటర్‌ రవికుమార్‌, సీడీపీవోలు విజయచంద్రిక, విజయలక్ష్మి, కిరణ్మయి, శ్రీజ, రూప, సాయిగీత, వాణి, పోషణ్‌ అభియాన్‌ కోఆర్డినేటర్‌ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌

విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పోటీల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చెకుముకి పోటీల్లో పాల్గొనాలన్నారు. పాఠశాలస్థాయి పోటీలు నవంబరు 18న, మండలస్థాయి పోటీలు ఈ నెల 22న, జిల్లాస్థాయి పోటీలు 27వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబరు 9వ తేదీ నుంచి కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, జన విజ్ఞానవేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జి.రమే్‌షబాబు, షేక్‌ జాఫర్‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-04T01:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising