TS News: ఆ డబ్బుకు.. నాకు సంబంధం లేదు: రాజగోపాల్ రెడ్డి
ABN, First Publish Date - 2022-10-31T14:25:17+05:30
ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
నల్గొండ (Nalgonda): ఈసీ (EC) ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని మునుగోడు (Munugodu) అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెలిపారు. తన కుమారుడికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాతో తనకు సంబంధం లేదని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. రూ. 5 కోట్ల 24 లక్షల నగదుకు సంబంధించి ఆదివారం సాయంత్రం 4 గంటలలోగా సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు ఇచ్చింది. ధీనిపై స్పందించిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా తనపై ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Updated Date - 2022-10-31T14:26:42+05:30 IST