TS News.. నిర్మల్ జిల్లా: బైంసాలో హైటెన్షన్
ABN, First Publish Date - 2022-11-28T12:50:50+05:30
నిర్మల్ జిల్లా: బైంసా (Bainsa)లో హైటెన్షన్ (High Tension) నెలకొంది. పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ (BJP) బహిరంగ సభ స్థలంవైపు ఎవరినీ అనుమతించడంలేదు.
నిర్మల్ జిల్లా: బైంసా (Bainsa)లో హైటెన్షన్ (High Tension) నెలకొంది. పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజేపీ (BJP) బహిరంగ సభ స్థలంవైపు ఎవరినీ అనుమతించడంలేదు. సభ ప్రాంగణం దగ్గర ఆందోళన
చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాంగణంలో ఉన్నవారినందరినీ బయటకు పంపారు. బీజేపీ నేతల ఆందోళన.. పోలీసుల కట్టడితో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ బీజేపీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సభ అనుమతి కోసం బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో సభ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
సోమవారం ఉదయం బండి సంజయ్ మహాపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి బైంసా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంది. ఈ సభలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ పాల్గొననున్నారు. అనంతరం ఇక్కడినుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే బహిరంగసభకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యగా బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్నారు.
Updated Date - 2022-11-28T12:50:54+05:30 IST